బిశ్వ భూషణ్ హరిచందన్ నాకు మిత్రుడు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా ఆయన సుపరిచితుడు
  • ఏపీకి గవర్నర్ గా నియమించడం సంతోషం
  • హరిచందన్ కు అభినందనలు
ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులైన హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘తెలుగు’, ‘ఇంగ్లీషు’ భాషల్లో ఆయన ట్వీట్లు చేశారు. హరిచందన్ తనకు మిత్రుడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా తనకు ఆయన సుపరిచితుడని చెప్పారు. ఎమ్మెల్యేగా, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజా సేవలో విశిష్టంగా పని చేశారని, ఈ అనుభవం ఏపీని మరింత ముందుకు తీసుకెళుతుందని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. 
Go Back to Shorts
vice president
Venkaiah Naidu
AP
Harichandan

More Telugu News